చైనా శాస్త్రవేత్తలు సముద్రగర్భంలో ఓ భారీ ఖనిజ నిధిని కనుగొన్నారు. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో చేపట్టిన పరిశోధనల్లో అత్యంత విలువైన బంగారం, వెండి నిక్షేపాలు పెద్ద మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి ఖనిజాల్లో ప్రతి టన్నుకు 15.4 గ్రాముల వరకు బంగారం, 1,271 గ్రాముల వరకు వెండి ఉన్నట్లు తేలింది. ఈ నిక్షేపాలు చైనా ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోని సముద్ర భాగంలో ఉన్నాయి. ఇక్కడ సముద్రపు నీటి ఉష్ణోగ్రత 315 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉన్నట్లు గుర్తించారు.