మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో విజయం సాధించింది. భారత మహిళల జట్టు ఈ కప్ ను గెలుచుకోవడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. ఈ విజయం ద్వారా జూనియర్ ప్రపంచ కప్లో భారత్కు స్థానం ఖరారైంది. ఛాంపియన్గా అవతరించిన నేపథ్యంలో.. జట్టులోని ప్రతి క్రీడాకారిణికి రూ.3 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.1.5 లక్షల చొప్పున నగదు బహుమతిని ‘హాకీ ఇండియా’ ప్రకటించింది.