ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం కలిగిన వారన్నారు. పేదరికం ఉన్నా కడుపులో దాచుకుంటారని సీఎం కొనియాడారు. దేశ సమగ్రత కోసం గాంధీ ప్రాణాలిస్తే, పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారన్నారు.గతంలో సీఎంలు ఎంత మంది మారినా ఆర్థికమంత్రిగా రోశయ్యనే కొనసాగించేవారని, ఆర్యవైశ్యులకు రావాల్సిన గుర్తింపు రాలేదని, ఆర్యవైశ్యుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు