కాంగ్రెస్ అధిష్టానం నుంచి కాల్స్ వస్తున్నా ఢిల్లీకి వెళ్లడం లేదని, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడేది లేదని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మంత్రి పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు కానీ, అకారణంగా తప్పించడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వరంగల్ ఈస్ట్ టికెట్ వస్తదని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు, అభిమానులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన తరువాత తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని కొండా దంపతులు తెలిపారు.