ఉత్తరాఖండ్ చమోలి
జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.
నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలోకి గత రాత్రి అకస్మాత్తుగా భారీ
వరద నీరు రావడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఒక కార్మికుడు గల్లంతైనట్లు తెలుస్తోంది. శిథిలాల కింద పడి 14 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వరద కారణంగా సొరంగంలో మొత్తం 22 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సొరంగం లోపల సుమారు 1.8 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న ఒక గుహ నుంచి నీరు, శిథిలాలు ఉధృతంగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు