పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా, బ్యాంకుల మధ్య ఆస్తుల వివాదానికి ఇక స్వస్తి పలకాలని బాంబే హైకోర్టు సూచించింది. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారానికి ఒక ముగింపు తీసుకురావాలని తెలిపింది. వివాదాన్ని ఇలాగే కొనసాగిస్తే దేశ ఆర్థికవ్యవస్థ పై ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం తన ఆస్తులను వినియోగించుకునేందుకు ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఇచ్చిన అనుమతిని తప్పుబడుతూ విజయ్ మాల్యా 2020లో సవాల్ చేశారు