బీఆర్‌ఎస్ X కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోండి: సీఎం రేవంత్‌రెడ్డి
పదేళ్ల గత పాలనను, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. కేపీహెచ్ బీ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కూకట్ పల్లి ప్రజలు తమకు కావాల్సిన పనులను మంత్రులతో చేయించుకోవచ్చని అన్నారు. 22ఏ నిషేధిత భూముల విషయంలో సమస్యలను పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు.