ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలువురు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.బదిలీలతో పాటు హైకోర్టు పరిపాలనా విభాగంలో పలు కొత్త నియామకాలను చేపడుతూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) శ్రీనివాస శివరాం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి (PDJ)గా పనిచేస్తున్న గుత్తాల గోపి ఏపీ హైకోర్టు నూతన రిజిస్ట్రార్ జనరల్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా వ్యవహరించిన వైవీఎస్‌బీజీ పార్థసారధిని ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా నియమించారు