నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ సమీపంలోని జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కిన్వాట్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సును వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రైవేట్ బస్సు టైరు పంచర్ కావడంతో కొంతమంది ప్రయాణికులు కిందకు దిగి రహదారి పక్కన ఉన్న డివైడర్‌పై కూర్చున్నారు. కంటైనర్ లారీ ఢీకొట్టడంతో బస్సు ముందుకు దూసుకెళ్లి డివైడర్‌పై కూర్చున్న ప్రయాణికులపైకి వెళ్లింది