బెంగళూరు మహానగరంతో పాటు కర్ణాటక వ్యాప్తంగా క్యాబ్ సేవలు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర రవాణా శాఖ నుంచి అధికారిక అనుమతి లభించింది. ‘కర్ణాటక ఆన్-డిమాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటర్స్ రూల్స్ 2016’ నిబంధనల ప్రకారం ఐదేళ్ల సుదీర్ఘ కాల పరిమితితో..ఆగస్టు 2031 వరకు ఈ లైసెన్స్‌ను మంజూరు చేశారు. కేవలం టాక్సీ క్యాబ్‌లకు మాత్రమే వర్తించే ఈ పక్కా చట్టబద్ధమైన పర్మిట్‌తో, ప్రయాణికులకు సురక్షితమైన, నమ్మకమైన సేవలు అందడమే కాకుండా క్యాబ్ డ్రైవర్ల భవిష్యత్తుకు పూర్తి భరోసా లభించింది.