సీజేఐకి వ్యతిరేకంగా నల్సార్ వర్సిటీ విద్యార్థుల ప్రవర్తనపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. సీజేఐ నుంచి పట్టాలు అందుకోబోమని ఇటీవల నల్సార్ విద్యార్థులు వీసీకి లేఖ రాశారు. ఈ ఘటనపై ఆగస్టు 19లోపు నివేదిక ఇవ్వాలని వర్సిటీ వీసీని బీసీఐ ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా విద్యార్థులపై చర్యలు ఉంటాయని పేర్కొంది. అప్పటి వరకు నల్సార్ విద్యార్థులు ఏ బార్ కౌన్సిల్లోనూ నమోదు చేసుకోవద్దని బీసీఐ స్పష్టం చేసింది.