ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ గుమ్మడి గోపాలకృష్ణకు ప్రతిష్ఠాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు లభించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. 2024 సంవత్సరానికి థియేటర్ నటనా విభాగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుమ్మడి గోపాలకృష్ణను అభినందిస్తూ తెలుగు నాటక రంగానికి చేసిన సేవలను ప్రశంసించారు. తెలుగు నాటక వైభవాన్ని దేశ, విదేశాల్లో చాటిన మీకు ఈ సందర్భంగా శుభాభినందనలు’ అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.