దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఫెడ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడం, ఎఫ్ఐఐల కొనుగోళ్లు సూచీలకు కలిసొచ్చింది. దీంతో సెన్సెక్స్ 900 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ 22,900 మార్కుకు కాస్త దూరంలో నిలిచింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్కరోజులో దాదాపు రూ.5 లక్షల కోట్లు పెరిగి రూ.477 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 73,268.47 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది.