అర్నబ్ తుఫాన్ కారణంగా భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో సుమారు రూ.4,563 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలు, వ్యవసాయ భూములు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాల నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం రేపు రాష్ట్రానికి రానున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసిన అనంతరం పరిహారం,
సహాయక చర్యలకు సంబంధించి తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.