నీళ్లు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, హైదరాబాద్లో తాగునీటికి కూడా కష్టంగా ఉంటే మూసీ సుందరీకరణ ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. మేడిగడ్డకు మరమ్మతులు చేసి వాడుకోకుండా, ఎవరు అడిగారని మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టారని నిలదీశారు. అసలు డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టుకు టెండర్లు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప రైతుల కష్టాలు పట్టడంలేదని కేటీఆర్ ఆరోపించారు.