తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని చెయ్యేరు, వేట్లపాలెంలో తుపాను నష్టాన్ని పరిశీలించారు. పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మార్గంమధ్యలో ఏరియల్ వ్యూ ద్వారా నష్టపోయిన పంటలను పరిశీలించారు. వరి, అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులను పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ ప్రాంతాలను పరిశీలించారు.పంట నష్టాన్ని అంచనా వేశారు.