మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఉన్న అంబర్‌నాథ్‌లో వివాహమై 48 రోజులకే విశాఖ తిల్కర్ (26) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్తమామలు పెళ్లిలో ఇచ్చిన కానుకలు సరిపోలేదని, పుట్టింటి నుంచి మరికొంత డబ్బు, బంగారం తీసుకురావాలని విశాఖను వేధించడం ప్రారంభించారు ఎవరితో మాట్లాడుతుందో కనిపెట్టడానికి బెడ్‌రూమ్ మినహా ఇల్లంతా నిఘా కెమెరాలు (CCTV) అమర్చారు. చివరకు మరణానికి రెండు రోజుల ముందు, పక్కింటి మహిళతో మాట్లాడిందనే చిన్న నెపంతో భర్త ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు.