ఇండియా ‘ఎ’, అఫ్గానిస్తాన్ ‘ఎ’ మధ్య జరిగిన ఐదో వన్డే మ్యాచ్ స్టార్టింగ్‌లో వైభవ్ ఇంకా ఖాతా తెరవకముందే అఫ్గాన్ ఫీల్డర్ ఒక క్లీన్ క్యాచ్ అందుకున్నాడు. తాను అవుట్ అయ్యానని ఫిక్స్ అయిన వైభవ్, అప్పటికే పిచ్ వదిలి బౌండరీ లైన్ వరకు వెళ్లాడు. కానీ రిప్లైస్‌లో క్యాచ్క్లియర్‌గా ఉన్నట్లు కనిపించినా.. థర్డ్ అంపైర్ మాత్రం బాల్ నేలకు తగిలిందనే సాకుతో ‘నాటౌట్’ అని ప్రకటించాడు. థర్డ్ అంపైర్ ఇచ్చిన షాకింగ్ డెసిషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.