ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్ వెళ్లిన తెలంగాణకు చెందిన మణిదీప్ రెడ్డి గుజ్జా మే 5వ తేదీ నుంచి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కుమారుడి నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ గానీ, సమాచారం గానీ రాకపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మణిదీప్ రెడ్డి ఫిన్లాండ్‌లోని లాహ్టి నగరంలో గల ప్రసిద్ధ ‘ఎల్‌యూటీ (LUT) యూనివర్సిటీ’లో చదువుతున్నాడు. ఈ విషయమై యూనివర్సిటీని సంప్రదించినప్పటికీ, వారు సరైన సమాధానం ఇవ్వడం లేదని, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.