సామాజిక కార్యకర్త గిరీశ్ మట్టన్నవర్ తనను కలిసి, చిన్నయ్య అనే వ్యక్తి మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పారని వెల్లడించారు. తమిళంలో మాట్లాడిన చిన్నయ్య తను కలవాలని కోరగా, అందుకు తాను అంగీకరించలేదని చెప్పారు. అనంతరం చిన్నయ్య తనకు పంపిన ఒక వాయిస్ మెసేజ్‌ను.. బాధ్యతగల పౌరుడిగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చీఫ్ ప్రణబ్ మొహంతికి ఫార్వార్డ్ చేసి సమాచారం అందించానని ఆయన వివరించారు.ఈ నిరాధారమైన ఆరోపణలపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తన ప్రతిష్టకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.