భారత జట్టు, ఆఫ్ఘాన్‌తో లక్నో వన్డేలో 170 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన భారత్, 3 మ్యాచుల సిరీస్‌ని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. 403 పరుగుల లక్ష్యఛేదనలో 44.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు, 232 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ కలిసి మూడో వికెట్‌కి 140 బంతుల్లో 224 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. శుభ్‌మన్ గిల్ 77 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు.