తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలు కోసం, ‘ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్’ (EHCT Board) బోర్డు సభ్యులను యమించింది. ఈ మేరకు EHCT బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీలైనంత త్వరగా సమావేశమై, EHS అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను, ఆరోగ్య కార్డుల జారీకి రూపొందించాలని ప్రభుత్వం మండలిని ఆదేశించారు. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు.