వనపర్తి జిల్లా దేవరకద్రలో బుధవారం వడగండ్ల గాలి వాన బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానతో సంత మొత్తం అస్తవ్యస్తం కాగా, పోచమ్మ ఆలయం ముందు సగం మేరకు చెట్లు, వ్యాపార సముదాయలు నెలకొరిగాయి. వర్ష బీభత్సానికి దేవరకద్ర అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న ఎస్బీఐ బ్యాంక్ ముందు విషాద ఘటన చోటుచేసుకుంది. గాలివాన బీభత్సానికి బ్యాంకు సమీపంలోని ఓ ఇంటిపై నిర్మాణం చేపడుతున్న ప్రహరీ గోడ కూలి పక్కనే ఉన్న కారుపై పడింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు