తమిళనాడు CM జోసెఫ్ విజయ్‌ను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు హీరోయిన్ సమంత రూత్ ప్రభు.విజయ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. “నేను చెన్నైలో అడుగు పెట్టినప్పుడు మన ముఖ్యమంత్రిని కలవబోతున్నాననే సంతోషం లిగింది. విజయ్ గారు వెండితెరపై హీరోగా మాత్రమే ఉండవలసిన వ్యక్తి కాదని నాకు ఎప్పుడూ అనిపించేది. ప్రజలు ఆయనకు ఇచ్చే గౌరవం, ఆయన పవర్ చూస్తుంటే… పెద్ద మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చారని అనిపిస్తుంది” అని సమంత పేర్కొన్నారు.