విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. మే 9న కృష్ణ లంక పోలీసులు మార్కాపురంలో అరెస్టు చేశారు తమ బిడ్డ ఆచూకి చెప్పాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. పోలీసులు తన బిడ్డను చంపేసి కనీసం శవం కూడా దొరక్కుండా చేశారని ఆరోపించారు. తన బిడ్డ ఆచూకి చెప్పాలని, చంపేసి ఉంటే కనీసం శవాన్ని అయినా అప్పగించాలని సాయికృష్ణ తల్లి మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు.