ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హన్మకొండలోని ప్రసిద్ధ భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. పూజారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. భద్రకాళి ఆలయం చాళుక్యుల కాలం నాటి చారిత్రక ప్రాధాన్యం కలిగినది. హన్మకొండ – వరంగల్ మధ్య భద్రకాళి సరస్సు పక్కన ఉంది. భారీ సంఖ్యలో అభిమానులు, స్థానికులు హనుమాన్ నగర్‌లో తరలివచ్చి పవన్ కళ్యాణ్‌ను చూడడానికి ఆసక్తి చూపారు.