ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా బీచ్ షాక్స్ విధానాన్ని తీసుకొస్తూ రెవెన్యూ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమికంగా ఈ సరికొత్త పైలట్ ప్రాజెక్ట్ను అమలు చేయబోతోంది. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో 2, విశాఖపట్నం తీరంలో 2 బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే పానీయాలు, అంటే.. బీర్, వైన్ , రెడీ-టు-డ్రింక్ పానీయాలు మాత్రమే ఇక్కడ విక్రయించాలి.