రుషికొండ భవనాల వినియోగం పై ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకు వీటి నయోగం పైన సుదీర్ఘ కసరత్తు చేసారు. మంత్రివర్గ ఉప సంఘం పలు విడతలుగా సమావేశమై.. పలువురి అభిప్రాయ సేకరణ చేసింది. మెజారిటీ అభిప్రాయం మేరకు రిసార్ట్‌గానే కొనసాగించాలని భావిస్తున్నామని చెప్పారు. భవనం నిర్వహణకు నెలకు రూ.25 లక్షలు, అందులో విలువైన వస్తువుల నిర్వహణకు రూ.1.5 కోట్లు ఖర్చు అవుతోందన్నారు.