ఉక్రెయిన్ గురువారం తన సరిహద్దుల నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా రాజధాని మాస్కోపై అతి పెద్ద డ్రోన్ దాడికి పాల్పడింది. మాస్కోలోని ఆయిల్ రిఫైనరీకి సమీపంలో దాడికి పాల్పడటం గమనార్హం. దీంతో అప్రమత్తమైన రష్యా అధికారులు మాస్కోలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. డ్రోన్ దాడులను తిప్పికొట్టే క్రమంలో మాస్కోలోని అత్యంత రద్దీగా ఉండే షెరెమెటివో విమానాశ్రయం నుండి ప్రయాణికులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనేక విమానాలను దారి మళ్లించారు.