దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పుణెకు చెందిన ప్రముఖ కెమిస్ట్రీ లెక్చరర్ పి.వి. కులకర్ణిని సీబీఐ అరెస్టు చేసింది. కులకర్ణి గత కొన్ని సంవత్సరాలుగా నీట్ ప్రశ్నపత్రాల తయారీకి సంబంధించిన ప్యానెల్‌లో సభ్యుడిగా పనిచేసినట్లు గుర్తించారు. ఎన్‌టీఏతో ఉన్న అనుబంధం కారణంగా ప్రశ్నపత్రాలకు ముందస్తు ప్రాప్యత అతనికి లభించినట్లు అధికారులు చెబుతున్నారు.పదవీ విరమణ చేసిన కాలేజీ ప్రొఫెసర్ పరిచయాలను ఉపయోగించి ఈ భారీ అక్రమానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.