పొదుపు చర్యల్లో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు ఈ-డిజిటల్, ఆన్‌లైన్ మహానాడు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 27, 28 తేదీల్లో ఈ మహానాడు నిర్వహించనున్నారు. మంగళగిరిలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో స్టేజ్ ఏర్పాటు చేసి, కేవలం పొలిట్‌బ్యూరో సభ్యులు మాత్రమే భౌతికంగా పాల్గొంటారు. మిగిలిన నేతలు, కార్యకర్తలు, అభిమానుల కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 1,845 క్లస్టర్లలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్యాడర్ అంతా ఒకేసారి డిజిటల్ పద్ధతిలో కనెక్ట్ అవుతారు.