దేశంలో ఇంధన పరిస్థితులు చక్కబడే వరకు భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని విష్ణుకుమార్ రాజు కోరారు. విమానాశ్రయం కంటే ప్రజలకు ఇంధనం అందుబాటులో ఉండటమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే, విశాఖపట్నం ఎయిర్‌పోర్టును యథాతథంగా కొనసాగించాలని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. పెట్రోల్, డీజిల్ కొరతతో సామాన్యులు అల్లాడుతున్న తరుణంలో ప్రభుత్వం విలాసవంతమైన ప్రాజెక్టుల కంటే ప్రజా అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.