కర్ణాటకలోని విజయనగర జిల్లాలో అతివేగంగా వచ్చిన ట్యాంకర్ ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. విజయనగర జిల్లా టీబీ డ్యామ్ సమీపంలోని జాతీయ రహదారి 50పై ఈ ఘోర ప్రమాదం సంభవించింది. హుళిగెమ్మ ఆలయంలో పూజలు ముగించుకుని భక్తులు ట్రాక్టర్‌పై తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక ట్యాంకర్ ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. వేగానికి రెండు వాహనాలు అదుపుతప్పి వంతెన పైనుంచి కింద పడిపోయాయి.