వికారాబాద్ జిల్లా తాండూరు యాలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన ఫరాన్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికపై గురువారం (మే 14) రాత్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఊహించని దారుణంతో దిగ్భ్రాంతికి గురైన బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడు ఫరాన్‌ను గాలించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై విట్టల్ రెడ్డి ధృవీకరించారు.