ఏపీలో కూటమి సర్కార్ పాలనలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది. అన్ని జిల్లాల్లోనూ పలు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, పార్టీ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం, పేపర్ లీకేజీపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి, డీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించి లోకేష్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అని అంబటి రాంబాబు డిమాండ్ చేస్తున్నారు.