ఉపాధి హామీ పథకంలో హాజరు నమోదుకు కొత్తగా తీసుకొచ్చిన ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు బయటపడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మల్యాల శ్రీను గుండు చేయించుకుని ఉపాధి పనులకు వెళ్లగా.. మొబైల్ సాఫ్ట్‌వేర్ అతడి ముఖాన్ని గుర్తించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎంతసేపటికీ ఫేస్ రికగ్నిషన్ కాకపోవడంతో.. చివరకు పక్కనే ఉన్న మహిళ జుట్టును తలపై కప్పి ఫొటో దిగిడంతో యాప్ అటెండెన్స్‌ను అంగీకరించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.