హమీర్‌పూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుఫాను కారణంగా బెత్వా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఐదుగురు కార్మికులు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా తుఫాను కారణంగా బలమైన గాలులు వీచాయి. ఈ భారీ గాలులకు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కొంత భాగం కూలిపోయింది. గాలుల ధాటికి వంతెన స్లాబ్, పిల్లర్‌తో పాటు స్కాఫోల్డింగ్ నిర్మాణం కూలిపోయింది. చాలా మంది కార్మికులు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.