loader

మెగా డీఎస్సీ కాదు మెగా దోపిడీ అంటూ వైసీపీ విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన మెగా డీఎస్సీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన చేతగానితనంతో ‘మెగా డీఎస్సీ’ని కాస్తా ‘దగా డీఎస్సీ’గా మార్చేసిందని ప్రతిపక్ష YSRCP తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కూటమి నేతల ‘మెగా దోపిడీ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, కూటమికి నేతలు నిరూపితం కాని పద్ధతుల్లో ఉద్యోగాలను అమ్ముకున్నారని ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని […]

20 రాష్ట్రాల రైతులకు కేంద్రం అత్యవసర అలర్ట్!

ఈ ఏడాది ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల రుతుపవనాలు బలహీనపడే సూచనలు ఉన్నాయని, దీనివల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు అప్రమత్తత ప్రకటించాయి.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షపాతం తక్కువగా నమోదయ్యే జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి, ముందస్తు […]

తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసేందుకు త్రిమూర్తుల కుట్ర : మాజీ మంత్రి వేముల ధ్వజం

చంద్రబాబు శక్తుల నుంచి తెలంగాణ ను కాపాడు కోవలసిన బాధ్యత బీఆర్‌ఎస్‌ శ్రేణులపై ఉందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే తెలంగాణను అవమానించిన తెలంగాణ ద్రోహి బక్కని నరసింహులని పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి , బీజేపీ నాయకులు, చంద్రబాబు నాయుడు ఇప్పటికి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఏనాటికైనా కేసీఆరే తెలంగాణకు శ్రీరామ […]

రేపు, ఎల్లుండి వీళ్లకు ఎండలు-వాళ్లకు వర్షాలు..!

ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రవేశం వేళ మిశ్రమ వాతావరణ పరిస్ధితులు కొనసాగుతున్నాయి. పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లా,గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45-46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉందన్నారు. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. వయోభారం కారణంగా.. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..శుక్రవారం హైదరాబాద్‌లోని నివాసంలో మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1967లో, 1994లో పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి ,2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొంది.. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి,వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లోమంత్రిగా పని చేశారు.

పంజాబ్ స్థానిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం..

పంజాబ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. పంజాబ్‌లో ఈ నెల 26న 102 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం పంజాబ్‌లో మొత్తం 1,977 వార్డులకు ఎన్నికలు జరగగా 1,735 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో 850 స్థానాలకుపైగా ఆప్ కైవసం చేసుకుంది. మిగిలిన వాటిలో కాంగ్రెస్ 342, శిరోమణి అకాళీదర్ 165, బీజేపీ 131, ఇండిపెండెంట్లు 241 సీట్లు దక్కించుకున్నాయి.

ఉన్నపలంగా 20శాతం ఎగిసిపడ్డ కాఫీ డే షేర్లు..

కర్ణాటక రాజకీయ పరిణామాల ప్రభావంతో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ఒక్కసారిగా 20 శాతం లాభపడి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాల నేపథ్యంలో పెట్టుబడిదారులు భారీగా షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. డీకే శివకుమార్ కుటుంబానికి కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుటుంబంతో ఉన్న బంధం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేకు డీకే శివకుమార్ తన కుమార్తె ఐశ్వర్యను […]

ఐరాస బ్లాక్‌లిస్ట్‌లోకి రష్యా, ఇజ్రాయెల్ దళాలు

సంఘర్షణ ప్రాంతాల్లో లైంగిక హింసకు పాల్పడినందుకు ఐక్యరాజ్యసమితి (UN) వార్షిక నివేదికలో రష్యా, ఇజ్రాయెల్ దళాలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం వివాదాస్పదంగా మారింది. ఈ నివేదికపై రెండు దేశాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్‌లో యుద్ధ సమయంలో బందీలపై రష్యా సైనికులు లైంగిక హింసకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల కారణంగా రష్యా దళాలను కూడా తొలిసారి ఈ జాబితాలో చేర్చారు. దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఐరాస నివేదికలో ఇజ్రాయెల్ దళాలను తొలిసారి చేర్చారు.

హైడ్రా ‘ఈగల్ టీమ్’‌లో ట్రాన్స్‌జెండర్లు..!

హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణల నుంచి రక్షిస్తున్న హైడ్రా విభాగంలో ట్రాన్స్ జెండర్లు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. తమకు లభించిన ఉద్యోగాలతో సమాజంలో గౌరవాన్ని పొందుతూ, ఆర్థిక భరోసాతో ముందుకు సాగుతున్నారు. మొత్తం 16 మంది ట్రాన్స్ జెండర్లకు హైడ్రా అవకాశం కల్పించింది. ఇందులో 11 మంది ట్రాన్స్ ఉమెన్, ఐదుగురు ట్రాన్స్ మెన్ ఉన్నారు. వీరికి ‘హైడ్రా ఈగల్ టీమ్’ గా ప్రత్యేక గుర్తింపు లభించింది. హైడ్రా యూనిఫామ్ ధరించడం తమలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని స్పష్టం […]

రాహుల్ తో షర్మిల భేటీ, రాజ్యసభ సీటు పై కీలక నిర్ణయం..!!

కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీకి వచ్చిన ఏపీసీసీ చీఫ్ షర్మిల రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు ఇద్దరి మధ్య మంత్రాంగం సాగింది. రాష్ట్ర రాజకీయాల పైన చర్చ జరిగింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని షర్మిల కోరినట్లు సమాచారం. షర్మిలకు రాజ్యసభ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం…ఆ దిశగా కసరత్తు చేస్తోంది. కర్ణాటక లేదా ఢిల్లీ కోటాలో షర్మిలకు రాజ్యసభ దక్కే అవకాశం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON