ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన మెగా డీఎస్సీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన చేతగానితనంతో ‘మెగా డీఎస్సీ’ని కాస్తా ‘దగా డీఎస్సీ’గా మార్చేసిందని ప్రతిపక్ష YSRCP తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కూటమి నేతల ‘మెగా దోపిడీ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, కూటమికి నేతలు నిరూపితం కాని పద్ధతుల్లో ఉద్యోగాలను అమ్ముకున్నారని
ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.