మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. వయోభారం కారణంగా.. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..శుక్రవారం హైదరాబాద్లోని నివాసంలో మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1967లో, 1994లో పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి ,2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొంది.. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి,వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లోమంత్రిగా పని చేశారు.