హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణల నుంచి రక్షిస్తున్న హైడ్రా విభాగంలో ట్రాన్స్ జెండర్లు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. తమకు లభించిన ఉద్యోగాలతో సమాజంలో గౌరవాన్ని పొందుతూ, ఆర్థిక భరోసాతో ముందుకు సాగుతున్నారు. మొత్తం 16 మంది ట్రాన్స్ జెండర్లకు హైడ్రా అవకాశం కల్పించింది. ఇందులో 11 మంది ట్రాన్స్ ఉమెన్, ఐదుగురు ట్రాన్స్ మెన్ ఉన్నారు. వీరికి ‘హైడ్రా ఈగల్ టీమ్’ గా ప్రత్యేక గుర్తింపు లభించింది. హైడ్రా యూనిఫామ్ ధరించడం తమలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని స్పష్టం చేస్తున్నారు.