సీఎం విజయ్ ఇవాళ రాష్ట్రంలోని పలువురు ఉన్నతాధికారుల్ని కలుసుకున్నారు. వీరిలో కొత్తగా నియామకాలు పొందిన వారు కూడా ఉన్నారు. వీరితో కలిసి విజయ్ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందులో తమిళనాడు సంప్రదాయ పంచె కట్టులో కనిపించారు. ఎప్పుడూ బ్లేజర్ లో కనిపించే విజయ్.. ఇలా పంచె కట్టులో కనిపించే సరికి అధికారులు కూడా కొత్తగా చూస్తున్నట్లు ఇందులో కనిపించింది. గతంలో తమిళనాడును ఏలిన ప్రతీ ముఖ్యమంత్రి ఇలా సంప్రదాయ పంచె కట్టునే కొనసాగించారు.