ఢిల్లీలోని అత్యంత సంపన్న ప్రాంతమైన హౌజ్ ఖాస్ లోని ధనేంద్ర కుమార్ నివాసంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోని ఒక గదిలో ఉన్న ఏసీ ఇండోర్ యూనిట్ హఠాత్తుగా పేలిపోయింది. దాంతో క్షణాల వ్యవధిలోనే ఇల్లంతా దట్టమైన నల్లటి పొగ, మంటలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో ఇంట్లో మొత్తం ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న ధనేంద్ర కుమార్ ఆ దట్టమైన పొగను ఎక్కువగా పీల్చడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను రక్షించే క్రమంలో ఆయన కుమారుడు కూడా గాయపడ్డారు.

