అనూహ్య పరిణామాల మధ్య కర్నాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య.. ఇవాళ అగ్రనేత రాహుల్ గాంధీని, ఢిల్లీలో కలిశారు.. ఈ సందర్భంగా సీఎం పదవి వదులుకున్నందుకు ప్రతిగా తన డిమాండ్లను రాహుల్ ముందుంచారు. తన కుమారుడు యతీంద్రకు కీలకమైన పోర్ట్‌ఫోలియోలు రాజ్యసభ, ఎమ్మెల్సీ నియామకాల కోసం పేర్ల జాబితాలతో పాటు, మంత్రివర్గ పదవులపై తన ప్రాధాన్యతలను కూడా అందజేసినట్లు సమాచారం. శివకుమార్ నిర్వహించిన పరిశ్రమలు లేదా జలవనరుల శాఖ వంటి కీలకమైన పోర్ట్‌ఫోలియోలను సిద్దరామయ్య పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.