తిరుపతి నడిబొడ్డున ఉన్న ప్రముఖ రాజ్‌పార్క్ హోటల్‌కు ఓ అజ్ఞాత వ్యక్తి ఇంటర్నెట్ కాల్ ద్వారా ఫోన్ చేసి హోటల్‌లో బాంబు పెట్టినట్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. హోటల్‌లో బస చేసిన అతిథులు, పనిచేస్తున్న సిబ్బంది ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయడంతో, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హోటల్ గదులు, పార్కింగ్ ప్రదేశాలు, వంటశాల, ప్రవేశ ద్వారాలను అణువణువూ క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. అనంతరం అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు.