విశాఖ జిల్లా అగనంపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి దండలతోనే నవ వధువు రామేశ్వరి దుర్మరణం చెందారు. .. నిన్న రాత్రి వాడ చీపురుపల్లిలో పెళ్లి కార్యక్రమం అనంతరం నవ దంపతులు అగనంపూడికి కారులో ప్రయాణిస్తుండగా ..వేగంగా వెళ్తున్న కారు శానివాడ సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా.. నవ వరుడు నర్సింగరావుకి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అతని పరిసితి కూడా విషమంగానే ఉన్నటు తెలుస్తోంది..

