loader

సౌదీలో తిరుపతి మహిళ ఆత్మహత్య.. కుటుంబ కలహాలేనా కారణం?

తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళ సౌదీ అరేబియాలో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెళ్లకూరు మండలం పునబాక గ్రామానికి చెందిన కోనేటి మమత (36), బుధవారం సౌదీలోని జుబేల్‌లో తన నివాసంలో ప్రాణాలు తీసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు ధృవీకరించారు. తిరుపతిలోని కుటుంబ ఆస్తుల వివాదం కారణంగా గత కొంతకాలంగా మమత తీవ్ర మనస్తాపంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం

కేరళం కొత్త సీఎం.. వి.డి. సతీషన్ విశేషాలు ఇవే..!

వి.డి. సతీషన్ పూర్తి పేరు వడస్సెరి దామోదరన్ సతీషన్. కొచ్చిలోని నాయర్ కుటుంబంలో 1964లో జన్మించిన సతీషన్.. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన.. NSUI సెక్రటరీగా పని చేశారు. 1996లో పరావూర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సతీషన్.. సీపీఐ అభ్యర్థి పి.రాజు చేతిలో ఓడిపోయారు 2001లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016 ఎన్నికల్లో గెలిచిన ఆయన చీఫ్ విప్‌గా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత […]

సిస్కోలో 4,000 ఉద్యోగాల కోత!

ప్రముఖ నెట్వర్కింగ్ సంస్థ ‘సిస్కో’.. మరో విడత ఉద్యోగ కోతలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో దాదాపు 4,000 మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఇది మొత్తం సిబ్బందిలో 5 శాతం కంటే తక్కువని పేర్కొంది. దీర్ఘకాలిక వృద్ధికి సంబంధించిన రంగాల వైపు పెట్టుబడులను మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఈ మార్పులు ఉన్నాయని సీఈవో చక్ రాబిన్స్ వివరించారు. మరోవైపు.. మూడో త్రైమాసికంలో 12 శాతం శాతం వృద్ధితో 15.8 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరినట్లు కంపెనీ వెల్లడించింది.

ఇక‌పై ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉపాధ్యాయులకు సంబంధించి రెండు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఒకవైపు పదోన్నతుల విషయంలో నిబంధనలను కఠినతరం చేస్తూనే, మరోవైపు ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చేలా విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కపై ఉపాధ్యాయుల ప్రమోషన్లలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అర్హత తప్పనిసరి. స్కూల్ అసిస్టెంట్, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు పొందే వారు ఖచ్చితంగా టెట్ పాస్ అయి ఉండాలి.  సర్వీసులో ఎప్పుడు చేరినప్పటికీ ప్రమోషన్ కావాలంటే టెట్ క్వాలిఫై కావాల్సిందే.

ఆ అమ్మాయి మైనర్ కాదు.! హైకోర్టులో బండి భగీరథ్ బెయిల్ పిటిషన్

అత్యాచారం కేసులో బాధితురాలి వయస్సుపై కొత్త చర్చ మొదలైంది. సదరు యువతి మైనర్ కాదని, ఆమె మేజర్ అని నిర్ధారించాలని కోరుతూ బండి భగీరథ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వయస్సు నిర్ధారణ అనేది అత్యంత కీలకమైన అంశంగా మారింది. చట్టపరమైన చిక్కుల నుండి బయటపడేందుకు ఈ వాదనను బలంగా వినిపిస్తున్నారు. మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్‌లో ఉన్న పుట్టిన తేదీనే అసలైన వయస్సుగా పరిగణించాలని కోరుతున్నారు. ఈ ఆధారంతో బాధితురాలు మేజర్ అని నిరూపించే ప్రయత్నం […]

కేరళ సీఎంగా వీడీ సతీశన్‌

కేరళ నూతన సీఎంగా వీడీ సతీశన్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేసింది. 11 రోజుల మథనం తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రి పేరును ప్రకటించింది. సతీశన్‌ స్వస్థలం ఎర్నాకుళం జిల్లా నెట్టూరు. 2021-26 మధ్య విపక్ష నేతగా ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 2001లో పరాపుర్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే

SIR లో పేరు తొలగించారా ?- సంక్షేమ పథకాలూ కట్..! తాజా షాక్..!

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ (SIR) ప్రక్రియ ఇప్పుడు ఓటర్ల జాబితా ప్రక్షాళనకే కాకుండా, సంక్షేమ పథకాల లీకేజీలను అరికట్టే దిశగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు ఎస్ఐఆర్ డేటాను ఉపయోగించి అనర్హులు, మరణించినవారు, నకిలీ లబ్ధిదారులను గుర్తించి, పథకాల్లో వృథాను తగ్గించాలని చూస్తున్నాయి. బీహార్‌, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఇప్పుడు దీనిని సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా ప్రక్షాళనకు ప్రాతిపదికగా చేసుకుని, అర్హులైన వారికే ప్రయోజనాలు […]

సూర్య ‘వీరభద్రుడు’ షోలు క్యాన్సిల్.. క్షమాపణలు చెప్పిన కరుప్పు టీమ్‌

తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’,తెలుగులో ‘వీరభద్రుడు’ సినిమా ఇవాళ గురువారం థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ విడుదలకు ముందు ఊహించని విధంగా ఈ సినిమాకి ఆర్థికపరమైన చిక్కులు ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో మార్నింగ్ షోలు రద్దయ్యాయి. తమిళంలోనే కాదు, తెలుగులోనూ మార్నింగ్ షో పడలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు థియేటర్లలో ఉదయం ఆటలు నిలిపివేశారు. మ్యాట్నీ షో బుకింగ్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయని సమాచారం. సినిమా క్యాన్సిల్ పై నిర్మాత ఎస్ఆర్ ప్రభు, […]

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

శ్రీకాకుళంజిల్లా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల లోడ్తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వైపు వెళ్తున్న క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. డివైడర్ను దాటుకుని అవతలి వైపునకు దూసుకెళ్లిన బొలెరో.. ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాహనంలో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

రాజ్‌కోట్ హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురు సజీవ దహనం

గుజరాత్‌లోని రాజ్‌కోట్-చోటిలా హైవేపై అర్ధరాత్రి వేళ ఘోర రహదారి ప్రమాదం సంభవించింది. ఒక ప్రైవేటు బస్సు, టార్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో పది మంది తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అహ్మదాబాద్ నుండి రాజ్‌కోట్ వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు, సాంగాణి గ్రామం సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న టార్ (డ్రమ్) ట్యాంకర్‌ను వెనుక నుండి బలంగా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON