గుజరాత్లోని రాజ్కోట్-చోటిలా హైవేపై అర్ధరాత్రి వేళ ఘోర రహదారి ప్రమాదం సంభవించింది. ఒక ప్రైవేటు బస్సు, టార్ ట్యాంకర్ను బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో పది మంది తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అహ్మదాబాద్ నుండి రాజ్కోట్ వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు, సాంగాణి గ్రామం సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న టార్ (డ్రమ్) ట్యాంకర్ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.

