ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ఇప్పుడు తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్స్ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై ఈ ప్రతిపాదనపై చర్చించారు.ఈ కొత్త కేంద్రం ద్వారా డిజిటల్ మౌలిక వసతులు, క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి.