జంతర్ మంతర్ వద్దకు వెళ్లి జాతీయ జెండా ఎగరేసేందుకు ప్రయత్నించిన సీజేపీ కాక్రోచ్ పార్టీ కీలక నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లను అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపారు. ఈ పరిణామాలపై కాక్రోచ్ జనతా పార్టీ భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో “లెహ్రా దో త్రిరంగా” అనే సందేశంతో అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో కన్నాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్క్లో భారీ సభ నిర్వహిస్తామని దిప్కే ప్రకటించారు.